CJI Surya Kant: రిటైర్ కాబోతున్న జడ్జీలకు క్లాస్ పీకిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
CJI Surya Kant: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్కు దగ్గరపడిన జీడ్జీల వైఖరిని ఆయన తప్పుపట్టారు. చివరి దశలో తమ తీర్పులతో సిక్సర్లు కొట్టే వైనం మంచిది కాదన్నారు. ఓ జిల్లా జడ్జీ కేసు అంశంలో ఈ విషయం వెలుగుచూసింది.
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతున్న సమయంలో.. జడ్జీలు తమ ఆదేశాలతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోందని, రిటైర్మెంట్ సమీపిస్తున్న జడ్జీలు తమ తీర్పులతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్మాలా బాగ్చీ కూడా ఉన్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జీ తన రిటైర్మెంట్కు పది రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆ జడ్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిటైర్మెంట్ సమీపిస్తున్న సమయంలో ఆ జడ్జీ రెండు కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ తీర్పులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ జడ్జీపై సస్పెన్షన్ విధించారు. పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తన రిటైర్మెంట్కు ముందు సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేశారని, ఈ అంశంపై లోతుగా ఏమీ చెప్పలేమని అన్నారు.
వాస్తవానికి ఆ జిల్లా జడ్జీ నవంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నది. కానీ నవంబర్ 19వ తేదీన ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే ఆ జడ్జీ పదవీవిరమణ వయసును మరో ఏడాది కాలం పాటు పొడిగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో మధ్యప్రదేశ్ సర్కారుకు చెప్పింది. రెండు కీలక ఆదేశాలు ఇచ్చిన అంశం ఆ జడ్జీ కూడా తెలియదని, కానీ రిటైర్మెంట్ వయసును ఏడాది పొడిగించినట్లు చెప్పారు. రిటైర్మెంట్కు ముందు సంచలన ఆదేశాలు ఇవ్వడం జడ్జీలకు ఓ ట్రెండ్‌గా మారిందన్నారు. తన సస్పెన్షన్‌ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని బెంచ్ ప్రశ్నించింది. జిల్లా జడ్జీ తరపున సీనియర్ న్యాయవాది విపిన్ సంఘీ వాదించారు. అనుచిత ఆదేశాలు ఇచ్చిన జడ్జీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సరికాదు అని, దీని కోసం ఆయన్ను సస్పెండ్ చేయలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

