Tirumala | ఆగస్టు 19న నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల
Tirumala | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.
తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ( Shrivari Arjitaseva tickets) సంబంధించిన నవంబరు నెల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ (Online Quota) లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు సూచించారు.
ఈ టికెట్లు పొందిన వారు ఈనెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయన్నారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
22 న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు(Virtual Seva) , వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది.
23న అంగప్రదక్షిణం టోకెన్లు
నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా.. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగస్టు 23న ఉదయం 11 గంటలకు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుందని వెల్లడించారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
నవంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నామని తెలిపారు.
27న శ్రీవారి సేవ కోటా విడుదల
27న తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

