రామగిరి, డిసెంబర్ 18 : నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీఎన్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్రా రాఘవరెడ్డి స్మారక ప్రజా వైద్యశాల అలాగే ఎంవీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షుగర్, బీపీ, ఫిట్స్, పక్షవాతం రోగులకు 21న ఆదివారం ఉదయం 7 నుండి 11 గంటల వరకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ జబ్బులు ఉన్నవారు రెండు మూడు రోజులకు ముందే టెస్టులు చేయించుకుని, ప్రస్తుతం వాడే మందులు, డాక్టర్ రాసిన స్లిప్పులు, పరీక్ష రిపోర్టులు వెంట తీసుకు రావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గోపాలం శీవన్నారాయణ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఈ నంబర్‌కి 9490098311 కి ఫొన్ చేసి సంప్రదించ్చని తెలిపారు.