లక్నో: శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఐపీఎల్-19 సీజన్‌కు దూరమయ్యాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో అయినా వస్తాడని ఆశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు నిరాశే ఎదురైంది. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోని అతడికి లంక బోర్డు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వలేదు.
దీంతో హసరంగ స్థానంలో లక్నో జట్టు.. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జార్జ్ లిండెను తీసుకుంది. కోటి రూపాయల కనీస ధరకు లక్నోతో చేరిన ఈ 33 ఏండ్ల ఈ సఫారీ క్రికెటర్‌కు పొట్టి ఫార్మాట్లో 250కు పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది.