గాలె: న్యూజిలాండ్తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టులో వన్ డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (116) శతకంతో చెలరేగాడు. టెస్టులలో రెండేండ్ల తర్వాత అతడికి ఇదే తొలి సెంచరీ. చండిమాల్కు తోడుగా ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
చెన్నైకి చుక్కెదురు
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ జట్టుకు చుక్కెదురైంది. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైయిన్ 0-1 తేడాతో మొహమ్మదీన్ క్లబ్ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో మొహమ్మదీన్ తరఫున లాల్రెమిసంగా ఫనాయి(39ని) ఏకైక గోల్ చేశాడు.