దుబాయ్: శ్రీలంక క్రికెటర్ దునిత్ వెల్లలగే(Dunith Wellalage) ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆ క్రికెటర్ తండ్రి సురంగ వెల్లలగే కన్నుమూశారు. ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో దునిత్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో లంక క్రికెటర్ తండ్రి మరణవార్త తెలిసింది. కానీ ఆ విషాద విషయాన్ని వెంటనే క్రికెటర్‌కు చెప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రి మరణించిన విషయాన్ని క్రికెటర్ దునిత్‌కు చెప్పారు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత కోచ్ సనత్ జయసూర్య.. మైదానంలోకి వెళ్లి దునిత్‌కు ఇంట్లో జరిగిన విషాదం గురించి వెల్లడించాడు. దుబాయ్‌లోని షేక్ జయిదా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లంక ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తండ్రి మరణవార్తకు చెందిన విషయాన్ని దునిత్‌కు జయసూర్య చెబుతున్న వీడియో వైరల్ అవుతున్నది.
No son should go through this💔
Jayasuriya & team manager right after the game communicated Dinuth Wellalage the news of his father’s passing away.pic.twitter.com/KbmQrHTCju
— Rajiv (@Rajiv1841) September 18, 2025
దునిత్ వెల్లలగే తండ్రి సురంగ కూడా క్రికెటరే. కానీ ఆయన జాతీయ జట్టుకు ఆడలేదు. కొలంబొలో కాలేజీ తరపున సురంగ ఆడాడు. అతను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీకి కెప్టెన్‌గా చేశాడని కామెంటేటర్ ఆర్నాల్డ్ తెలిపారు.
మ్యాచ్ బ్రేక్ సమయంలో దునిత్ తండ్రి మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఓ దశలో పెద్దగా స్కోర్ చేయలేదు. అయితే ఆ ఇన్నింగ్స్ లో దునిత్ వేసిన ఓ ఓవర్లో ఆఫ్ఘన్ బ్యాటర్ నబీ చెలరేగిపోయాడు. దునిత్ బౌలింగ్‌లో ఏకంగా అయిదు సిక్సర్లు బాదేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రి మరణవార్త గురించి దునిత్‌కు లంక కోచ్ చెప్పారు. అయితే దునిత్ బౌలింగ్‌లో అయిదు సిక్సర్లు కొట్టిన నబీకి స్థానిక రిపోర్టర్లు సమాచారం ఇచ్చారు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో దునిత్ తండ్రి చనిపోయినట్లు ఓ రిపోర్టర్ నబీకి చెప్పాడు. ఆ విషాదం పట్ల నబీ పశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. దునిత్ కుటుంబ క్షేమాన్ని కోరుతూ ట్వీట్ చేశాడు నబీ.
Heartfelt condolences to Dunith Wellalage and his family on the loss of his beloved father.
Stay strong Brother pic.twitter.com/d6YF2BhlnV— Mohammad Nabi (@MohammadNabi007) September 18, 2025