కొలంబో: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని చేరువలో ఉంది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(2/13), ప్రభాత్ జయసూర్య(2/47) ధాటికి బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. షాద్మాన్ ఇస్లాం(12), అనాముల్హక్(19), మోమినుల్ హక్(15), కెప్టెన్ నజ్ముల్(19) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
లిటన్‌దాస్(13) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న బంగ్లా 96 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 290/2 తొలి ఇన్నింగ్స్‌కు దిగిన లంక 458 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పతుమ్ నిస్సనక(158) సెంచరీతో కదంతొక్కగా, చండిమల్(93), కుశాల్ మెండిస్(84) అర్ధసెంచరీలతో రాణించారు. తైజుల్ ఇస్లాం(5/131) ఐదు వికెట్లతో రాణించాడు.