Sri Lanka | లండన్: ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు చిరస్మరణీయ విజయం దక్కింది. తొలి రెండు టెస్టులూ ఓడిన లంకేయులు.. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టుకు షాకిచ్చారు.
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 94/1తో ఆట ఆరంభించిన లంకకు పతుమ్ నిస్సంక (127 నాటౌట్), కుశాల్ మెండిస్ (39), ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.