కొలంబో: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కొలంబోలో జరిగిన మొదటి మ్యాచ్లో కంగారూలకు శ్రీలంక షాకిచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన మ్యాచ్లో లంక 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 46 ఓవర్లలో 214 రన్స్ చేశారు. కెప్టెన్ చరిత్ అసలంక (127), దునిత్ వెల్లలగె (30) ఆ జట్టును ఆదుకున్నారు. అనంతరం స్వల్ప ఛేదనలో ఆసీస్.. 33.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. లంక స్పిన్నర్లు మహీశ్ తీక్షణ (4/40), వెల్లలగె (2/33) కంగారూలను కట్టడి చేశారు.