కొలంబో : స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టులో విఫలమైనా కొలంబో ఆతిథ్యమిస్తున్న రెండో టెస్టులో మాత్రం లంక బౌలర్లు రాణించారు. బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. బ్యాటింగ్ వైఫల్యంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
మొదటి టెస్టులో శతకాలతో విజృంభించిన కెప్టెన్ నజ్ముల్ హోసేన్ శాంతో (8)తో పాటు ముష్ఫీకర్ రహీమ్ (35) ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్. లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో, అసిత దినుష తలా రెండు వికెట్లు పడగొట్టారు.