SRH vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. సీజన్ ఆసాంతం అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders).. క్వాలిఫయర్ 1లో రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగుతున్న ఈ పోరులోనే ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. టేబుల్ టాపర్స్ ఫైట్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ సారథి కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కీలకమైన మ్యాచ్ కావడంతో రెండు జట్లు ఏ మార్పులు చేసే సాహసం చేయలేదు
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్.
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
🚨 Toss Update 🚨
Sunrisers Hyderabad elect to bat against Kolkata Knight Riders.
Follow the Match ▶️ https://t.co/U9jiBAl187#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/LXVNHfhhp3
— IndianPremierLeague (@IPL) May 21, 2024
ఇంప్యాక్ల ప్లేయర్స్ : కోల్‌కతా – అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రానా, శ్రీకర్ భరత్, రూథర్‌ఫర్డ్.
హైదరాబాద్ – సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిఫ్స్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనాద్కాట్.
ఈ సీజన్లో కోల్‌కతా 9 విజయాలతో టాప్‌లో నిలవగా.. ఎనిమిది మ్యాచుల్లో గెలుపొందిన సన్‌రైజర్స్ రెండో స్థానం దక్కించుకుంది. లీగ్ దశలో ఇరుజట్లు తొలిసారి తలపడిన మ్యాచ్‌లో కోల్‌కతాదే పైచేయి అయింది. ఫైనల్ బెర్తును నిర్ణయించే ఈ పోరులో కోల్‌కతాకు విధ్వంసక ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(Philip Salt) అందుబాటులో లేకపోవడం పెద్ద దెబ్బ. దాంతో, సునీల్ నరైన్ జతగా రహ్మనుల్లా గుర్బాజ్ ఇన్నింగ్స్ ఆరంభించే చాన్స్ ఉంది.
సునీల్ నరైన్
ఇక మిడిల్ ఓవర్ల నుంచి దంచేందుకు వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్(Rinku Singh), ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్‌లు ఉండనే ఉన్నారు. బౌలింగ్ యూనిట్లో స్పిన్ ద్వయం చక్రవర్తి, నరైన్‌లు సన్‌రైజర్స్ స్టార్లను ఇరుకున్న పెట్టేందుకు కాచుకొని ఉన్నారు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్
మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ మెరుపులతో టాప్ 2కు దూసుకొచ్చింది. ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ శర్మ(Abhishek Sharma)ల జోడీ ఈ సీజన్లోనే బెస్ట్ అనిపించుకుంది. ఆఖర్లో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టేందుకు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్‌లు ఉండనే ఉన్నారు. అయితే.. బౌలింగ్ యూనిట్లో భువనేశ్వర్, నటరాజన్ మినహా మరెవరూ పెద్దగా రాణించడం లేదు. స్పిన్నర్ మయాంక్ మార్కండే మ్యాచ్‌ను మలుపు తిప్పలేకపోతున్నాడు. అదొక్కటే సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.