Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో విజయం తమదేనంటే తమదేనని అధికార వైఎస్సార్ పార్టీ పేర్కొంటున్నారు. 150కిపైగా సీట్లు సాధించి జూన్ 9న రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ఖాయమని నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం తప్పదన్నారు. సీఎం జగన్ చెబుతున్నట్లుగానే అమిత్షా, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ సైతం చెబుతున్నారన్నారు. తాను గత పదేళ్లుగా ఎన్నికల్లో పని చేస్తున్నానని.. ఫలితాలకు ముందు ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదన్నారు. ఫలితాల రోజున జగన్కు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. జగన్ ఓటమి ఖాయమైందని.. వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోబోతుందన్నారు. దేశంలో ఎవరు ఎక్కడ గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారనేది అంచనా వేయగలనని.. జగన్ విషయంలోనూ తన అంచనాలు తప్పవన్నారు.