IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అన్నిజట్లకు గాయాల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చెన్నై, ముంబై, గుజరాత్ కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు ఆడుతున్న యువస్పిన్నర్ స్మరన్ రవిచంద్రన్ (Smaran Ravichandran) సైతం గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దాంతో, అతడి స్థానాన్ని హర్ష్ దూబే (Harsh Dubey)తో భర్తీ చేసింది హైదరాబాద్ యాజమాన్యం. ఈ విషయాన్ని ఆరెంజ్ ఆర్మీ సోమవారం వెల్లడించింది.
టాటా ఐపీఎల్ 18వ సీజన్ మిగతా మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ స్పిన్నర్ స్మరణ్ రవిచంద్రన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో విదర్భ స్పిన్ సంచలనం హర్ష్ దూబేతో ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది. దేశవాళీలో మెరుగైన ప్రదర్శన చేసిన అతడు 16 టీ20లు, 20 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో కలిపి 121 వికెట్లు పడగొట్టాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌కు హైదరాబాద్ రూ.30లక్షలు చెల్లించనుంది.
Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025
సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌పై హైదరాబాద్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ కమిన్స్(3-19) నిప్పులు చెరగగా ప్రత్యర్థిని 133కే కట్టడి చేసింది ఆరెంజ్ ఆర్మీ. ఇక విజయం అందినట్టే అనుకున్న వేళ భారీ వర్షం పడింది. చివరకు మ్యాచ్ వర్షార్పణం కావడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. దాంతో, గత సీజన్లో అదిరే ఆటతో రన్నరప్‌గా నిలిచిన కమిన్స్ సేన అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సన్‌రైజర్స్ స్క్వాడ్ : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షమీ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, అథర్వ తైడే, వియాన్ మల్డర్, జయదేవ్ ఉనాద్కాట్, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ, అనికేత్ వర్మ, ఈషన్ మలింగ, సచిన్ బేబీ, హర్ష్ దూబే.