Delhi airport : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indiaragandhi International Airport) లో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok) నుంచి రష్యా రాజధాని మాస్కో (Moscow) కు 425 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏరోఫ్లోట్ విమానం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆగివున్న సమయంలో క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అధికారులు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. ప్రయాణికులను విమానం నుంచి బయటికి తీసుకొచ్చారు.
ఏరోఫ్లోట్కు చెందిన SU 273 విమానం క్యాబిన్లో మంటలు చెలరేగాయని, దాంతో ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రయాణికులను రెస్క్యూ చేశామని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమానంలోని మొత్తం 425 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే విమానంలో మంటలు చెలరేగడానికి కారణం ఏమిటి..? ప్రస్తుతం విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే ఉందా లేదంటే మాస్కోకు బయలుదేరిందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.