IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో దుమ్మురేపుతున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) సొంత ఇలాకాలో మరో మ్యాచ్ ఆడుతోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన హార్దిక్ పాండ్యా సేన వాంఖడేలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
నిషేధిత డ్రగ్ కారణంగా జట్టుకు దూరమైన పేసర్ కగిసో రబడ జట్టులో కలిశాడని గిల్ చెప్పాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం.. మా వ్యూహాలను పక్కాగా అమలు చేయడమే తమకు ప్రధానమని పాండ్యా వెల్లడించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3, 4వ స్థానాల్లో ఉన్న ముంబై, గుజరాత్‌లకు ఇది కీలక పోరు. ఇందులో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువవుతుంది. సో.. ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, కార్బిన్ బాస్చ్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ : కరణ్ శర్మ, రాజ్ బవ, రాబిన్ మింజ్, రీసే టాప్లే, అశ్వనీ కుమార్.
🚨 Toss 🚨@gujarat_titans won the toss and elected to field against @mipaltan
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/rnOezltlvv
— IndianPremierLeague (@IPL) May 6, 2025
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంప్యాక్ట్ సబ్స్ : వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లొమ్రోర్, అనుజ్ రావత్, దసున్ శనక, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్.