Kavya Maran | కావ్య మారన్ (Kavya Maran).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కో-ఓనర్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటే చాలు.. స్టేడియంలో ఆమె కచ్చితంగా ఉండాల్సిందే. సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఆమె చేసే సందడి అంతా ఇంతాకాదు. బౌండరీలు, సిక్సులు, వికెట్లు తీసిన సమయాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ.. ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్‌ను ఉత్సాహపరుస్తుంటారు. చప్పట్లు కొడుతూ.. స్టాండ్స్‌లో గంతులేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆటలో ఆరెంజ్ ఆర్మీ ఓటమి, గెలుపు సందర్భంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ ప్రతిసారీ హైలెట్‌గా నిలుస్తుంటాయి. ఈ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట మీమ్స్ కూడా సందడి చేస్తుంటాయి. ఈ మీమ్స్‌పై కావ్య మారన్ తాజాగా స్పందించారు.
ఆట పట్ల తనకున్న మక్కువ వల్లే తాను ఎక్కువగా కెమెరామెన్ దృష్టిలో పడుతుంటానని తెలిపారు. ‘క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తా. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కడ ఆడినా నేను వెళ్తాను. హైదరాబాద్‌లోనే కాకుండా అహ్మదాబాద్, చెన్నై లాంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంటాను. టీమ్‌కు మద్దతు తెలుపుతాను. ఆ సమయంలో నేను స్టాండ్స్‌లో ఎక్కడో చాలా దూరంలో కూర్చొని ఉంటా. అయినా కెమెరామెన్ నన్ను వదలడు. ఎలాగోలా కనిపెట్టి కెమెరాలో బంధిస్తాడు. అలా నా ఎక్స్ప్రెషన్స్ నెట్టింట మీమ్స్‌గా మారుతున్నాయి’ అంటూ కావ్య మారన్ చెప్పుకొచ్చారు.
Also Read..