జైపూర్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) మళ్లీ గెలుపు బాట పట్టింది. టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న శ్రీనిధి టీమ్ గురువారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
శ్రీనిధి తరఫున అంజెలో ఒర్లీన్(43ని), డేవిడ్ కాస్టెండా(73ని) గోల్స్ చేయగా, మైకోల్ కాబ్రెరా(75ని)రాజస్థాన్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంలో శ్రీనిధి ప్రస్తుతం 19 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నది.