శంకర్పల్లి: ఐబీఎస్-ఇక్ఫాయ్లో స్పోర్ట్స్ ఫెస్టివెల్ జోరుగా, హుషారుగా సాగుతున్నది. టీమ్ వీఏపీఎస్ ఆధ్వర్యంలో ఏఏవీఈజీ-13 పేరిట నిర్వహిస్తున్న పోటీలకు రెండో రోజైన శనివారం వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఆయా క్రీడా విభాగాల్లో హోరాహోరీగా తలపడ్డారు. నిరంతరం చదువులతో కుస్తీపట్టే విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. క్రికెట్, చెస్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ మ్యాచ్లు అలరించాయి. చివరి రోజైన ఆదివారం టేబుల్ టెన్నిస్ ఫైనల్, బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, సింగిల్స్, క్రికెట్ సెమీస్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు అవార్డుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, పలువురు ప్రముఖులు ప్రసంగాలు ఇవ్వనున్నారు.