హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని (డిసెంబర్ 3) పురస్కరించుకుని దివ్యాంగులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను బుధవారం నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. దివ్యాంగుల, వయోవృద్ధుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ మంగళవారం ప్రకటనలో వెల్లడించారు.
పోటీల్లో 900మంది క్రీడాకారులతో పాటు 3వేల మంది పాల్గొననున్నారని వెల్లడించారు.