Spirit Of Cricket | మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. మరోసారి చర్చనీయాంశంగా ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’
Spirit Of Cricket : వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆటగాడు ఎంజెల్ మాథ్యూస్(Angelo Mathews s) అనూహ్యా రీతితో టైమ్డ్ ఔట్(Timed Out)గా వెనుదిదిరిగాడు. టైమ్డ్ ఔట్ కోసం బంగ్లాదేశ్ అప్పీలు చేయడంతో 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'(Spirit Of Cricket) మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో...
Spirit Of Cricket : వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆటగాడు ఎంజెల్ మాథ్యూస్(Angelo Mathews s) అనూహ్యా రీతితో టైమ్డ్ ఔట్(Timed Out)గా వెనుదిదిరిగాడు. టైమ్డ్ ఔట్ కోసం బంగ్లాదేశ్ అప్పీలు చేయడంతో ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్'(Spirit Of Cricket) మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో బంగ్లాదేశ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు తూట్లు పొడిచిందంటూ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు.
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) బంగ్లాదేశ్ అలా చేయడం సమర్థనీయం కాదనగా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్‌లు బంగ్లా కెప్టెన్ తీరును తప్పుబట్టారు. ‘కామన్సెన్స్ అనేది లేదు. క్రికెట్ ఎటు వెళ్తోంది’ అంటూ పాక్ మాజీ సారథి మిస్బాహుల్ హక్ వ్యాఖ్యానించాడు.
Dramatic scenes in Delhi with Angelo Mathews becoming the first batter to be timed out in international cricket 👀
Details 👉 https://t.co/Nf8v8FItmh#BANvSL #CWC23 pic.twitter.com/VwjFfLHOQp
— ICC (@ICC) November 6, 2023
ఐసీసీ నియమాల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక.. కొత్తగా వచ్చే ఆటగాడు 2 నిమిషాల్లోపే క్రీజులో ఉండాలి. లేదంటే అతడిని ఔట్‌గా ప్రకటిస్తారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అంజెలో మాథ్యూస్ మైదానంలోకి వచ్చినప్పటికీ… హెల్మెట్ సరిగ్గాలేదనే కారణంతో బంతిని ఎదుర్కోవడం ఆలస్యం చేశాడు. దాంతో క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ రికార్డుల్లోకెక్కాడు.
ఎంజెల్ మాథ్యూస్

అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న మాథ్యూస్ తాను క్రీజులోకి వచ్చిన టైమింగ్‌ను సూచిస్తున్న ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఆ పరిస్థితుల్లో బంగ్లా కాకుండా మరే జట్టు అయినా అప్పీల్‌ను వెనక్కి తీసుకునేదని మండిపడ్డాడు. అయితే.. బంగ్లా సారథి షకిబుల్ హసన్ మాత్రం నిబంధనలను లోబడే తాము ప్రవర్తించామని, అవసరమైతే ఐసీసీనే నియమాలను మార్చాలని వివరణ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
షకీబల్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సమరవిక్రమ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే డగౌట్లో ఉన్న సహచరులకు సైగ చేసి హెల్మెట్ తీసుకురమ్మన్నాడు. టైమ్ వేస్టు కావడాన్ని గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబ్ ‘హౌ ఈజ్ దట్’ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో లెగ్ అంపైర్‌తో చర్చించిన అంపైర్ మాథ్యూస్‌తో మాట్లాడాడు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, మాథ్యూ స్ గార్డ్ తీసుకోకపోవడంతో అతడిని ఔట్‌గా ప్రకటించాడు.ఈ మ్యాచ్‌లో బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. మెగా టోర్నీలో ఆరో ఓటమితో చాంపియన్స్ ట్రోఫీ 2025లో సైతం వెనకబడిన లంక నవంబర్ 9న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
-
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడుత ఎన్నికలు.. సుక్మా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
-
Rachin Ravindra | వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్.. జాక్‌పాట్ కొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

