కింగ్స్టన్: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో మరో అద్భుత మ్యాచ్ జరిగింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చిన నేపాల్ .. అనూహ్య రీతిలో ఓటమి చెందింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో నేపాల్ అద్భుత పోరాట స్పూర్తిని ప్రదర్శించింది. చివరి బంతికి రెండు రన్స్ అవసరం కాగా, బ్యాటర్ గుల్షన్ జా.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు. ఒక్క పరుగు వచ్చినా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేది. కానీ నేపాల్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఓ దశలో 24 బంతుల్లో 22 రన్స్ చేయాల్సిన నేపాల్.. 18 బంతుల్లో 18 రన్స్ చేయాల్సిన సమయంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ షంస్సీ కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఒట్టోనిల్ బార్ట్‌మాన్ వేశాడు. ఆ ఓవర్లో 8 రన్స్ అవసరం కాగా, ఆరు రన్స్ మాత్రమే వచ్చాయి. తొలుత దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు 115 రన్స్ చేయగా, నేపాల్ ఏడు వికెట్లు 114 రన్స్ మాత్రమే చేసింది. గ్రూప్ డీలో 4 మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది.
South Africa survived an upset for the ages by the barest of margins 😯#SAvNEP #T20WorldCup
Full report and match highlights ⬇https://t.co/dJkJP6aOsI
— T20 World Cup (@T20WorldCup) June 15, 2024