గయానా: వెస్టిండీస్‌తో గయానా వేదికగా జరిగిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా గెలుచుకుంది. ఆట నాలుగో రోజు సఫారీలు నిర్దేశించిన 263 పరుగుల ఛేదనలో ఆతిథ్య విండీస్ 222 పరుగుల వద్దే ఆగిపోవడంతో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది.
ఛేదనలో కరీబియన్ జట్టును స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (3/37), పేసర్లు కగిసొ రబాడా (3/50), వియాన్ మల్డర్ (2/35) దెబ్బతీశారు. విండీస్ తరఫున గుడకేశ్ మోటీ (45) టాప్ స్కోరర్. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ వచ్చే శుక్రవారం నుంచి మొదలుకానుంది.