Heinrich Klaasen : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెరీర్ ఆసాంతం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన క్లాసెన్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సోమవారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. ‘నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనదా? కాదా? అనే ఆలోచనతో కొన్ని రోజులు నిద్రపట్టలేదు. మొత్తానికి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయ్యా. నాకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం చాలా కష్టమైన నిర్ణయమే’ అని 32 ఏండ్ల క్లాసెన్ తెలిపాడు.
టీమిండియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో క్లాసెన్ బదులు కైలీ వెర్రెన్నే(Kyle Verreynne)ను ఆడించారు. దాంతో, ఇక సుదీర్ఘ ఫార్మాట్ తనకు వర్కవుట్ కాదని అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘మైదానంలో, మైదానం బయట నేను అనుభవించిన కష్టాలు నన్ను క్రికెటర్‌గా మర్చాయి.
Heinrich Klaasen Calls It A Day
Proteas wicketkeeper batter Heinrich Klaasen has today announced his retirement from Test cricket🇿🇦🏏
The 32-year-old steps away from the red-ball format after featuring in four matches for SA between 2019 – 2023.#WozaNawe #BePartOfIt pic.twitter.com/w620BkcLhG
— Proteas Men (@ProteasMenCSA) January 8, 2024
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అరంగేట్రం సమయంలో నాకు లభించిన టెస్ట్ క్యాప్ చాలా అమూల్యమైనది. టెస్టు కెరీర్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు నాముందు కొత్త సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదుక్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని క్లాసెన్ వెల్లడించాడు. ఇక నుంచి వన్డేలు, టీ20లపై ఈ డాషింగ్ బ్యాటర్ దృష్టిపెట్టనున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్
ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో క్లాసెన్‌కు మెరుగైన రికార్డు ఉంది. 85 మ్యాచుల్లో 46.09 సగటుతో పరుగులు బాదాడు. దాంతో, 2019లో భారత పర్యటనలో క్లాసెన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాంచీలో జరిగిన మ్యాచ్ అనంతరం రెండో మ్యాచ్ కోసం అతడు నాలుగేండ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2023లో క్లాసెన్ వెస్టిండీస్‌తో సిడ్నీ, సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లో రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. మొత్తంగా నాలుగు మ్యాచుల్లో అతడు 104 రన్స్ కొట్టాడంతే. అయితే.. వన్డేలు, టీ20ల్లో మాత్రం క్లాసెన్ ట్రాక్ రికార్డు అద్భుతం. బంతిని బలంగా కొట్టే ఈ హిట్టర్‌కు పొట్టి ఫార్మాట్లో 172.71, వన్డేల్లో 140.66 స్ట్రైక్ రేటు ఉంది.