Steve Smith : వరల్డ్ క్లాస్ ఆటగాడైన స్టీవ్ స్మిత్ (Steve Smith) యాషెస్ సిరీస్‌లో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. సీడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో 13వ సారి ఈ సిరీస్‌లో మూడంకెల స్కోర్ అందుకున్నాడతడు. తద్వారా ఈ సిరీస్ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాక్ హాబ్స్(Jack Hobbs) రికార్డును బ్రేక్ చేశాడు స్మిత్. ఇక పరుగుల పరంగా ఆ దేశ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Don Bradman)కు మరింత చేరువయ్యాడీ సొగసరి బ్యాటర్.
స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ రికార్డుల మోత మోగించాడు. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు ఈ సిరీస్‌లో రెండో అత్యధిక సెంచరీలు నమోదు చేశాడు. రెండో అత్యధిక పరుగుల మైలురాయిని అధిగమించాడీ రన్ మెషీన్. ప్రస్తుతం స్మిత్ ఖాతాలో 3,682 పరుగులు ఉన్నాయి.
He just keeps going 💪 pic.twitter.com/1ZGb7I4YeW
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2026
యాషెస్‌లో టాప్ స్కోరర్ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 5,028 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతిష్టాత్మక ఈ సిరీస్‌లో బ్రాడ్‌మన్ 19 శతకాలతో టాప్‌లో ఉండగా.. స్మిత్ 13 సెంచరీలతో రెండో ర్యాంకుకు ఎగబాకాడు. ఉన్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా పది సెంచరీలు, వాల్లీ హమాండ్ 9, డేవిడ్ గ్రోవర్ 9 సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
తన దూకుడైన ఆట, నిలకడతో ఫ్యాబ్ -4లో ఒకడిగా వెలుగొందిన స్మిత్ స్మిత్ సెంచరీలతో రికార్డులు నెలకొల్పుతున్నాడు. యాషెస్ సిరీస్ అంటే చాలు పరుగుల వరద పారించే ఈ క్రికెటర్.. ఇంగ్లండ్‌పై 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఒక ప్రత్యర్థిపై టెస్టుల్లో ఇన్నేసి రన్స్ కొట్టిన నాలుగో ఆటగాడిగా రికార్డు పట్టేశాడు.
More #Ashes history for Steve Smith, who brings up another stunning SCG hundred 👏#MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/w76y8wGbWy
— cricket.com.au (@cricketcomau) January 6, 2026
అతడికంటే ముందు బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై సచిన్ 110 మ్యాచుల్లో 6,707 రన్స్ చేయగా.. కోహ్లీ 106 మ్యాచుల్లో 5,551 పరుగులు సాధించారు. శ్రీలంకపై సచిన్ 109 మ్యాచ్‌లో 5,108 రన్స్ కొట్టాడు. బ్రాడ్‌మన్ ఇంగ్లండ్‌పై 37 మ్యాచుల్లో 5,028 పరుగులు బాదాడు.