గోదావరిఖని : అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలనీ.. తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప స్వామి దీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భగవంతుడిని వేడుకున్నారు. ఈ ఏడాది 31వ సారి అయ్యప్పమాల ధరించిన కోరుకంటి చందర్.. 41 రోజుల మండల దీక్షను పూర్తిచేసుకుని, స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో ఇరుముడి ధరించి శబరిమలై వెళ్తున్న సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు.
కోరుకంటి చందర్ తన కుమారుడు మణిదీప్తో కలిసి గోదావరిఖని శ్రీకోదండ రామలయంలోని అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇరుముడి కట్టుకుని కుటుంబసభ్యులు, అభిమానులు, BRS పార్టీ నాయకుల సమక్షంలో శబరిమలైకి బయలుదేరారు. అంతకుముందు ఇరుముడితో అయ్యప్ప ఆలయంలో, శివాలయంలో, రామాలయంలో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామగుండం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు.
గత 31 ఏండ్లుగా తాను అయ్యప్ప దీక్ష తీసుకున్నానని, ఐదుసార్లు పెద్దపాదం ద్వారా స్వామివారిని కొండలు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నానని ఆయన తెలిపారు. ఈసారి కూడా పెద్దపాదం ద్వారా శబరిమలై దర్శనం చేసుకోనున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రావాలని, త్వరలో జరుగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గెలిచి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ప్రజలు, ఆ అయ్యప్ప స్వామి దీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాముకుంట్ల భాస్కర్, పెంట రాజేష్, నారాయణదాసు, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాధo విజయ, బొడ్డుపల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, మెతుకు దేవరాజ్, కరవేది శ్రీనివాస్ రెడ్డి, ముద్దసాని సంద్యారెడ్డి, బుర్రి వెంకటేష్, నీరటి శ్రీనివాస్, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, కోడి రామక్రిష్ణ, గుంపుల లక్ష్మీ కనకలక్మి, గుర్రం పద్మ, కిరణ్ జీ, చింటూ, ఇరుగురాళ్ల శ్రావణ్ కనకరాజ్, డాక్టర్ బుషేంద్రం తదితరులు పాల్గొన్నారు.