జోహాన్నెస్‌బర్గ్: ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో పర్యటించే టీ20, వన్డే జట్లను క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) మంగళవారం ప్రకటించింది.
ఈ జట్లకు టెంబా బవుమా సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 మధ్య సాగే ఈ పర్యటనలో సఫారీ జట్టు.. టీమిండియాతో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. గాయం కారణంగా వాన్ డర్ డస్సెన్ టీమ్‌కు దూరమయ్యడు.