South Africa | కేప్‌టౌన్: సొంతగడ్డపై వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికా మరో క్లీన్‌స్వీప్‌తో దుమ్మురేపింది. తమ దేశ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్‌ను రెండు టెస్టులలోనూ ఓడించి సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. కేప్‌టౌన్‌లో ముగిసిన రెండో టెస్టులో ఆ జట్టు పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్ ఆడుతూ పాక్.. 478 పరుగులకు ఆలౌట్ అయింది. 58 పరుగుల ఛేదనను సఫారీలు.. 7.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పూర్తి చేశారు. రికల్టన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో జాన్సెన్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.