అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన గ్రూపు-డీ పోరులో సఫారీ టీమ్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. మార్కో యాన్సెన్(4/40) ధాటికి కివీస్ 20 ఓవర్లలో 175/7 స్కోరుకే పరిమితమైంది. మార్క్ చాప్మన్(48), డారిల్ మిచెల్(32) మినహా అందరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
176 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ మార్క్మ్(్ర44 బంతుల్లో 86 నాటౌట్, 8ఫోర్లు, 4సిక్స్‌లు) దూకుడైన అర్ధసెంచరీతో దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 స్కోరు చేసింది. కివీస్ బౌలర్లను ఏ దశలోనూ కుదురుకోనివ్వని మార్క్మ్ 19 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫెర్గుసన్, నీషమ్, రచిన్ ఒక్కో వికెట్ తీశారు.