గెబెర్క: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
ఓపెనర్లు టోనీ డి జార్జి (0), మార్క్మ్ (20) నిరాశపర్చగా, ర్యాన్ రికల్టన్ (250 బంతుల్లో 101, 11ఫోర్లు) అరంగేట్రం సెంచరీతో కదంతొక్కాడు. లాహిరు కుమార (3/54), ఫెర్నాండో (2/67) రెండు ఆకట్టుకున్నారు.