SAW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన దక్షిణాఫ్రికా (South Africa)కు షాక్. ఇంగ్లండ్‌పై దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ తంజిమ్ బ్రిస్ట్(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. దాంతో, పవర్ ప్లేలో దంచికొట్టాలనుకున్న సఫారీలకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కెప్టెన్ లారా వొల్వార్డ్త్(22), అన్నెకె బొస్చ్(1)లు నిదానంగా ఆడుతున్నారు. దాంతో, 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.
వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో తొలి ఓవర్ నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఓపెనర్లు ఎదురు దాడికి దిగారు. బౌండరీలతో చెలరేగిన తంజిమ్ బ్రిస్ట్(13), లారా వొల్వార్డ్త్(22)లు స్కోర్ బోర్డును ఉరికించారు. వీళ్లిద్దరి జోరుతో 5 ఓవర్లకే స్కోర్ 30 దాటేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని లిన్సే స్మిత్ విడదీసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చింది.