Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాల నడుమ భారత జట్టు అతికష్టమ్మీద బోణీ కొట్టింది. తొలి పోరులో న్యూజిలాండ్‌కు కనీస పోటీ ఇవ్వని టీమిండియా.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ తేడాతో గెలిచే అవకాశాన్ని పోగొట్టుకుంది. 106 పరుగుల లక్ష్యాన్ని దాదాపు ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్లి మైనస్ రన్ రేటుతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రెండు మ్యాచుల్లో ప్రత్యర్థి వేరు కావొచ్చు.. కానీ మన అమ్మాయిల ఆట మాత్రం అధ్వాన్నంగా సాగింది.
రెండు నెలల క్రితం సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను చిత్తుగా ఓడించిన ఇదే జట్టు తొలి కప్ వేటలో విఫలమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు షఫాలీ వర్మ(Shafali Varma), స్మృతి మంధాన(Smriti Mandhana)లు ఆత్మరక్షణలో పడిపోవడం.. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోయేందుకు అవకాశమిస్తోంది.
That winning feeling 😃👌
📸: ICC
Scorecard ▶️ https://t.co/eqdkvWWhTP#TeamIndia | #T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/4ADqGn4Sxl
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు విఫలమవ్వగా న్యూజిలాండ్ కొండంత స్కోర్ కొట్టింది. అలాంటప్పుడు అటాకింగ్ గేమ్‌తో కీవీస్ బౌలర్లపై విరుచుకుపడి వాళ్ల స్థైర్యాన్ని దెబ్బతీయాల్సిన ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు ఆత్మరక్షణ ధోరణి అవలంబించగా.. మిడిలార్డర్ మీద గెలుపు భారం పడింది. పాక్‌పై కూడా అదే పరిస్థితి. హిట్ పెయిర్‌గా పేరొందిన షఫాలీ, మంధానలు న్యూజిలాండ్‌పై 11 , పాక్‌పై 18 పరుగులు జోడించారంతే. రెండు మ్యాచుల్లోనూ శుభారంభం దక్కకపోవడంతో ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్‌లు ఒత్తిడికి లోనై వికెట్ పారేసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ మీద అయితే.. భారత బ్యాటర్లు బౌండరీల కంటే సింగిల్స్ మీదే ఫోకస్ పెట్టారు. దాంతో.. దాయాది బౌలర్లు ఇదే అదనుగా డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచారు.
#TeamIndia are back to winning ways!
A 6-wicket win against Pakistan in Dubai 👏👏
📸: ICC
Scorecard ▶️ https://t.co/eqdkvWWhTP#T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/0ff8DOJkPM
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
అయ్యో ఓటమి తప్పదా? అనుకున్న దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒడ్డున పడేసింది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం సెమీస్ చేరాలంటే ఇక అన్నీ లీగ్ మ్యాచ్‌లు ఎక్కువ తేడాతో గెలవాల్సిన పరిస్థితి. తర్వాతి మ్యాచుల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో భారత్ ఆడనుంది. ఈ మూడింటిలో ఏ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. అందుకని సెమీస్ చేరాలంటే ఓపెనర్లు షఫాలీ, మంధాన మెరుపు ఇన్నింగ్స్ ఆడడం చాలా ముఖ్యం. ఇక బౌలింగ్‌లో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి మినహా ఎవరూ పెద్దగా రాణించడం లేదు.
Asha Shobhana has dropped two of the easiest catches ever seen,including one of Fatima Sana.
Then Fatima Sana hits her for 2 consecutive boundaries.
Asha finally has the last laugh as she dismisses her!
🇵🇰 70/6#ICCWomensT20WorldCup #T20WorldCup #INDvsPAK #T20WomensWorldCup pic.twitter.com/Ex1EAJvXP4
— 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐓𝐡𝐫𝐢𝐥𝐥𝐬 🇮🇳 🏏 (@Cricket_Thrills) October 6, 2024
వరల్డ్ కప్ తొలి పోరులో కివీస్ భారీ స్కోర్ చేయడంలో మన అమ్మాయిల చెత్త ఫీల్డింగ్ ఓ కారణం. ఇక పాక్‌పై కూడా సలువైన రెండు క్యాచ్లున స్లిప్‌లో ఉన్న ఆశా శోభన నేలపాలు చేసింది. ఐసీసీ ట్రోఫీని అందుకోవాలంటే.. బ్యాటింగ్ ఒక్కటే కాదు బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా రాణించాలి. అప్పుడే ట్రోఫీని అందుకోగలం అనే విషయం తెలిసినా పేలవమైన ఫీల్డింగ్‌తో భారత జట్టు భారీ మూల్యం చెల్లిస్తోంది.