Duvvada Srinivas | ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. దువ్వాడ సతీమణి ఆందోళన ఎపిసోడ్ జరిగిన చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందు కనిపించారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చిన వీరిద్దరూ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి ఫొటోషూట్ కూడా దిగింది.
ఆస్తుల పంపకానికి సంబంధించి ఇటీవల టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చిన వాణి అక్కడే ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్, మాధురి సంబంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మాధురి ఆత్మహత్యకు కూడా యత్నించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత సోమవారం నాడు తిరుమల కొండపై కనిపించారు. సోమవారం ఉదయం బ్రేక్ దర్శనంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దివ్వెల మాధురి మీడియాతో మాట్లాడుతూ.. అందరి సమక్షంలోనే తొందరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. కోర్టు కేసులు ముగిశాక పెళ్లి చేసుకుంటామని.. అప్పటి వరకు కలిసే ఉంటామని స్పష్టం చేశారు. రెండేళ్లుగా మాధురితోనే ఉంటున్నానని దువ్వాడ శ్రీను చెప్పారు. కోర్టు కేసులు క్లియర్ అయ్యాక పెళ్లిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
లీగల్ ప్రోసీడింగ్స్ క్లియర్ అయితే తరువాత పెళ్ళే….. అంత వరకూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం..
తిరుమలలో దువ్వాడ ప్రియురాలు మాధురీ..#DuvvadaSrinivas #divvelamadhuri #tirumalatemple #AndhraPradesh #RTV pic.twitter.com/thRhfiJq9W
— RTV (@RTVnewsnetwork) October 7, 2024