అహ్మదాబాద్: గత ఎడిషన్ రన్నరప్ దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగి పసికూన కెనడాపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టైటిల్ ఫేవరేట్లుగా ఉన్న సఫారీలు.. కెనడాపై 57 పరుగుల తేడాతో గెలిచారు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (32 బంతుల్లో 59, 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39, 1 ఫోర్ , 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్ (21 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ మెరుపులతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతగా అనుభవం లేని కెనడా బౌలర్లపై ఆదినుంచే విరుచుకుపడ్డ మార్క్మ్,్ర డికాక్ (25) జోడీ.. 7 ఓవర్లలోనే 70 రన్స్ జోడించి శుభారంభం అందించింది.
సఫారీ సారథి బౌండరీల వర్షం కురిపించాడు. హాఫ్ సెంచరీ అనంతరమే అతడు నిష్క్రమించగా రికెల్టన్, బ్రెవిస్ వికెట్లను ఒకే ఓవర్లో కోల్పోయినా ఆఖర్లో మిల్లర్, స్టబ్స్ మెరుపులు మెరిపించి ఆ జట్టుకు భారీ స్కోరునందించారు. కెనడా బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ ఈ ఇద్దరూ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి గజగజలాడి 20 ఓవర్లకు 156/8కే పరిమితమైంది. తొలి స్పెల్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లుంగి ఎంగిడి (4/31) నిప్పులు చెరిగే బంతులతో 3 కీలక వికెట్లు తీసి కెనడాను కోలుకోనీయకుండా చేశాడు. అయితే నవ్‌నీత్ ధలివాల్ (49 బంతుల్లో 64, 7 ఫోర్లు, 1 సిక్స్), హర్ష్ ఠాకర్ (29 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సఫారీల బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే గాక ఐదో వికెట్‌కు 69 రన్స్ జోడించి ఆ జట్టు పరువు కాపాడారు.
1 టీ20 ప్రపంచకప్‌లో అత్యధికసార్లు 200+ స్కోరు చేసిన జట్లలో దక్షిణాఫ్రికా (6) అగ్రస్థానంలో ఉంది. భారత్, వెస్టిండీస్ మూడుసార్లు ఈ ఘనత సాధించాయి.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 213/4 (మార్క్మ్ 59, మిల్లర్ 39, అన్ష్ పటేల్ 3/31, దిల్‌ప్రీత్ 1/40);
కెనడా: 20 ఓవర్లలో 156/8 (నవ్‌నీత్ 64, హర్ష్ 33, ఎంగిడి 4/31, యాన్సెన్ 2/26)