ఆంటిగ్వా: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. చివరి ఓవర్ వరకు సాగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా గ్రూప్ 2 లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వర్షం వల్ల కుదించిన మ్యాచ్‌లో.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి కేవలం 135 రన్స్ మాత్రమే చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో షంస్సీ 27 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే చేజింగ్ సమయంలో వర్షం రావడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 17 ఓవర్లలో 123 రన్స్‌కు కుదించారు. ఇంకా అయిదు బంతులు మిగిలి ఉండగానే ఆ టార్గెట్‌ను సౌతాఫ్రికా అందుకున్నది. చివరలో జేన్సన్ ఓ సిక్సర్, బౌండరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నది.
What a finish in Antigua 🥵
The Proteas go through to the #T20WorldCup Semi-Finals 🌟#WIvSA 📝https://t.co/wzOEYGXC20 pic.twitter.com/1g5iYiwCuS
— T20 World Cup (@T20WorldCup) June 24, 2024