లాహోర్ : పాకిస్థాన్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు పాక్‌తో జరుగుతున్న టెస్టులో రెండో రోజు 216/6తో నిలిచింది. రియాన్ రికెల్టన్ (71), టోని డి జార్జి (81 నాటౌట్) అర్ధశతకాలతో ఆదుకున్నారు. కెప్టెన్ మార్క్మ్ (20) తో పాటు మల్డర్ (17), స్టబ్స్ (8), వెరియానె (2) విఫలమవగా బ్రెవిస్ డకౌట్ అయ్యాడు.
ఆ జట్టు ఇంకా 162 పరుగులు వెనుకబడే ఉంది. పాక్ బౌలర్లలో నొమన్ అలీ (4/85) నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 రన్స్‌కు ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా (93), రిజ్వాన్ (75) రాణించారు.