Sourav Ganguly | భారత మాజీ కెప్టెన్ ఇంట్లో చోరీ.. లక్షన్నర విలువైన ఫోన్ గాయబ్
Sourav Ganguly : భారత మాజీ కెప్టన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly ) ఇంట్లో దొంగతనం జరిగింది. కోల్కతాలోని బెహలా(Behala)లో ఉన్న దాదా ఇంట్లోకి చొరబడిన దొంగలు.. రూ.1.6 లక్షల విలువైన ఫోన్ ఎత్తుకెళ్లారు. దాంతో, గంగూలీ వెంటనే సమీపంలోని..
Sourav Ganguly : భారత మాజీ కెప్టన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly ) ఇంట్లో దొంగతనం జరిగింది. కోల్కతాలోని బెహలా(Behala)లో ఉన్న దాదా ఇంట్లోకి చొరబడిన దొంగలు.. రూ.1.6 లక్షల విలువైన ఫోన్ ఎత్తుకెళ్లారు. దాంతో, గంగూలీ వెంటనే సమీపంలోని థాకురుపుకుర్(Thakurupura) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దాన్ని దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని గంగూలీ పోలీసులను కోరాడు. అసలేం జరిగిందటే…
ఇంట్లోని ఒక ప్లేస్లో ఫొన్ దాచి పెట్టిన దాదా బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ ఫోన్ కనపడలేదు. అందులో పలువురి కాంటాక్ట్లతో పాటు, ముఖ్యమైన డేటా ఉందట. దాంతో, మాజీ బీసీసీఐ బాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించాడు. ఈ మధ్యే గంగూలీ ఇంటికి పెయింటింగ్ వేశారు. దాంతో, పెయింటింగ్ వేసిన వాళ్లలో ఎవరో ఒకరు అతడి ఫోన్ను కాజేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకని వాళ్లను పిలిపించి విచారిస్తున్నారు.
సౌరభ్ గంగూలీ

భారత జట్టు క్రికెట్కు దూకుడు నేర్పిన కెప్టెన్గా పేరొందిన గంగూలీ ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం దాదా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(Director of Cricket)గా సేవలందిస్తున్నాడు.
రిషభ్ పంత్

నిరుడు ఐపీఎల్లో 9వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈసారి టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) 17వ సీజన్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో, ఢీల్లీ మేనేజ్మెంట్తో పాటు జట్టు మొత్తం కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
- ISRO – URSC Recruitment | ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్లో 224 పోస్టులు
- Samyuktha Menon | నిఖిల్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సంయుక్త మీనన్
- SA20 | మర్క్రమ్, స్టబ్స్ వీరవిహారం.. దక్షిణాఫ్రికా లీగ్ చాంపియన్గా సన్రైజర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

