Samyuktha Menon | నిఖిల్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సంయుక్త మీనన్
Samyuktha Menon | ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో మంచి సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక అంటే వెంటనే గుర్తొచ్చేది నటి సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటివరకు సంయుక్త చేసిన అని సినిమాలు విజయాలే. బీమ్లానాయక్, బింబిసార, సర్, విరూపాక్ష రీసెంట్గా వచ్చిన ‘డెవిల్’ ఇలా ప్రతి సినిమాతో మంచి హిట్ అందుకుంది.
Samyuktha Menon | ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో మంచి సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక అంటే వెంటనే గుర్తొచ్చేది నటి సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటివరకు సంయుక్త చేసిన అని సినిమాలు విజయాలే. బీమ్లానాయక్, బింబిసార, సర్, విరూపాక్ష రీసెంట్గా వచ్చిన ‘డెవిల్’ ఇలా ప్రతి సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తుంది. అందులో ఒకటి నిఖిల్ హీరోగా వస్తున్నా స్వయంభు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ గుర్రపు స్వారీ నేర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా సంయుక్త మీనన్ కూడా హార్స్ రైడింగ్ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది.
2024 నా గురించి.. నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నాకంటూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అందులోనే ఉండాలనుకోను.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నటిగా నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే వాటిని అమలు చేయాలనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ప్రస్తుతం నా తదుపరి చిత్రం స్వయంభు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను.. నన్ను నమ్మండి ఈ ప్రయాణం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. మనశ్సాంతిగా ఉంటుంది. గుర్రపు స్వారీ ప్రతి అడ్డంకిని తొలగిస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ సంయుక్త రాసుకొచ్చింది.
2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫
As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7
— Samyuktha (@iamsamyuktha_) February 10, 2024
స్వయంభు చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. స్వయంభు చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

