SA20 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్(Durban Super Giants)ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో సన్‌రైజర్స్ జట్టు 89 పరగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మర్క్రమ్ సేన 204 పరుగులు చేసింది.
కుర్రాడు టిట్సన్ స్టబ్స్(56 నాటౌట్ : 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అబెల్(55 : 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ శతకాలతో విరుచుకుపడగా.. మర్క్రమ్(42 నాటౌట్) చితక్కొట్టాడు. భారీ ఛేదనలో డర్బన్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మార్కో జాన్సెన్ 5 వికెట్లు తీయడంతో డర్బన్ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. బహుమతి ప్రదానం అనంతరం ఎస్ఏ 20 ట్రోఫీని మర్కర్మ్ సన్‌రైజర్స్ యాజమాని కావ్య మారన్(Kavya Maran)కు అందించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవ్వగా.. హెన్రిచ్ క్లాసెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు అందుకున్నాడు.
𝘽𝙖𝙘𝙠-𝙩𝙤-𝙗𝙖𝙘𝙠 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨
Sunrisers win the #Betway #SA20Final by 89 runs.#WelcomeToIncredible pic.twitter.com/JEdLwmoplX— Betway SA20 (@SA20_League) February 10, 2024
క్వాలిఫయర్ 2లో జొబర్గ్ సూపర్ కింగ్స్‌పై డర్బన్ జట్టును చిత్తుగా ఓడించి డర్బన్ జట్టు ఫైనల్లో మాత్రం తేలిపోయింది. సన్‌రైజర్స్ బ్యాటర్ల జోరుకు డర్బన్ బౌలర్లు తలవంచారు. డేంజరస్ డేవిడ్ మలన్(6) తక్కువకే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన అబెల్‌తో కలిసి జోర్డన్ హెర్మన్(42) విధ్వంసం సృష్టించాడు. అనంతరం స్టబ్స్, మర్క్రమ్ డర్బన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 98 రన్స్ జోడించి జట్టుకు కొండంత స్కోర్ అందించారు.
This is the moment. 🏆#Betway #SA20Final #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/JPlDxwXFhm
— Betway SA20 (@SA20_League) February 10, 2024
భారీ ఛేదనలో రైజర్స్ బౌలర్ల ధాటికి డర్బన్ 7 పరుగలుకే మూడు వికెట్లు కోల్పోయింది. కీలక ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్(0)ను డకౌట్‌గా వెనుదిరగగా.. వియాన్ మల్డర్(38), డ్వేన్ ప్రిటోరియస్(28)లు పోరాడారు. అయితే.. జాన్సెన్‌తో పాటు డానియల్ వొరాల్, బార్ట్మన్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ డర్బన్ను ఓటమి అంచుల్లోకి నెట్టారు. చివరి వికెట్‌గా వచ్చిన టాప్లే(0)ను జాన్సెన్ బౌల్డ్ చేయడంతో సన్‌రైజర్స్ జట్టు డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. దాంతో, మర్క్రస్ సేన వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.