Neymar Jr – Al-Hilal : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దాంతో స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు పలు దేశాల ఫుట్‌బాల్ క్లబ్స్ పోటీపడుతున్నాయి. తాజాగా అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi)ని ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో, అతడితో కాంట్రాక్టు కుదుర్చుకోవాలనుకున్న సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్‌కు నిరాశే మిగలింది. ఈసారి ఆ క్లబ్ మరో స్టార్ ఆటగాడి కోసం చూస్తోంది.
బ్రెజిల్ స్టార్ ఆటగాడు, పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్ ఫార్వర్డ్ నెయ్మర్ జూనియర్(Neymar Jr)ను కొనేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అతడిని సంప్రదించింది కూడా. నెయ్మర్కు రికార్ఢు స్థాయిలో రూ. 1000 కోట్ల(200 మిలియన్ యూరోలు)కు పైగా ఆఫర్ చేసింది. మెస్సీకి కూడా రూ. 300 కోట్లు(45 మిలియన్ యూరోలు) ముట్టజెప్పాలనుకుంది. కానీ, అతను ఆసక్తి చూపలేదు.
మిమామి క్లబ్‌కు ఆడనున్న మెస్సీ
ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన మెస్సీ గత వారమే పీఎస్జీ క్లబ్‌కు గుడ్ బై చెప్పాడు. పీఎస్జీతో రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియమే అందుకు కారణం. మెస్సీ తప్పుకోవడంతో ఆ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్ల(6.8కోట్లు)కి చేరింది. మరోవైపు మియామి క్లబ్‌కు మెస్సీ ఫ్యాన్స్ పోటెత్తారు. అంతకు ముందు మియాబి క్లబ్‌ను 9 లక్షల మంది మాత్రమే ఫాలో అయ్యేవాళ్లు. ‘నేను మియామికి ఆడబోతున్నా’ అని మెస్సీ చెప్పగానే ఈ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 51 లక్షలకు చేరింది. ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్(David Beckham) మియామి క్లబ్ సహ- యజమానిగా ఉన్నాడు.