Venkatesh Iyer | అతడిలా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్ అవ్వాలని ఉంది : వెంకటేశ్ అయ్యర్
Venkatesh Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)లాగ తాను కూడా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్ కావాలనుకుంటున్నానని అతను అన్నాడు. 'హార్దిక్ పాండ్యా ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్. నాకు కూడా 'వెంకటేశ్.. ఒక పూర్తి స్థాయి ఆల్‌రౌండర్' అనిపించుకోవాలని ఉంది. బ్యాటుతో, బంతితో...
Venkatesh Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)లాగ తాను కూడా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్ కావాలనుకుంటున్నానని అతను అన్నాడు. ‘హార్దిక్ పాండ్యా ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్. నాకు కూడా ‘వెంకటేశ్.. ఒక పూర్తి స్థాయి ఆల్‌రౌండర్’ అనిపించుకోవాలని ఉంది. బ్యాటుతో, బంతితో రాణించి జట్టు విజయాల్లో భాగం కావాలనుకుంటున్నా’ అని కోల్‌కతా ఓపెనర్ తన మనసులో మాట చెప్పాడు.
అంతేకాదు ఐపీఎల్ 16వ సీజన్ (2023)లో తమ జట్టుకు రింకూ సింగ్ (Rinku Singh)రూపంలో మంచి ఫినిషర్ దొరికాడని అయ్యర్ తెలిపాడు. రెండు సార్లు చాంపియన్ అయిన కోల్‌కతా పదహారో సీజన్లో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. గత సీజన్లలో విఫలమైన వెంకటేశ్ అయ్యర్ ఈసారి చెలరేగాడు. మునపటి దూకుడు కనబరిచిన అతను ఐపీఎల్లో తొలి శతకం సాధించాడు. అది కూడా బలమైన ముంబై ఇండియన్స్‌పై. దాంతో, కోల్‌కతా ఫ్రాంచైజీ తరఫున సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్(2008లో) పవర్ హిట్టర్ బ్రెండన్ మెక్కల్లం(Brendon McCullum) ఆర్సీబీపై వంద కొట్టాడు.
వెంకటేశ్ అయ్యర్ – బ్రెండన్ మెక్కల్లం

ఐపీఎల్ టు టీమిండియా
ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాకు ఎంపికైన కుర్రాళ్లలో వెంకటేశ్ అయ్యర్ ఒకడు. దక్షిణాఫ్రికాపై 2022 జనవరి 19న వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్‌పై అతను టీ20ల్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు అయ్యర్ ఐపీఎల్లో 36 మ్యాచ్‌లు ఆడాడు. 28.12 సగటుతో 956 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండర్ 86 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు.
ఇవి కూడా చదవండి
Mitchell Starc | ఫ్రాంచైజీ క్రికెట్లో డబ్బులు వస్తాయి.. పోతాయి.. అందుకని దేశానికే ప్రాధాన్యమిస్తా : ఆసీస్ స్పీడ్‌స్టర్
ICC | అన్ని ఫార్మాట్లలో సూపర్ స్టార్స్.. ఆసీస్ ఆటగాళ్లపై ఐసీసీ ట్వీట్ వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

