ICC : టెస్టు చాంపియన్‌షిప్(WTC Final 2023) విజయంతో.. ఐసీసీ ఫైనల్స్‌లో తమకు తిరుగులేదని వరల్డ్ నంబర్ 1 జట్టు ఆస్ట్రేలియా(Australia) మరోసారి చాటింది. దాంతో, అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా అవతరించింది. ఓవల్(Oval) మైదానంలో సంచలన ఆటతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా ఆ జట్టులోని ఐదుగురు సీనియర్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా మరో రికార్డు సాధించారు. అదేంటో తెలుసా..? మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో వీరు సభ్యులుగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..?
డేవిడ్ వార్నర్(David Warner), స్టీవ్ స్మిత్(Steve Smith), ప్యాట్ కమిన్స్(Pat Cummins), మిచెల్ స్టార్క్(Mitchell Starc), జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood)… ఈ ఐదుగురు.. వన్డే వరల్డ్ కప్, పొట్టి ప్రపంచ కప్, టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో సభ్యలు కావడం విశేషం. వీళ్లు మూడు ట్రోఫీలు పట్టుకొని ఉన్న ఫొటోను ఐసీసీ తాజాగా ట్విట్టర్లో షేర్ చేసింది. దానికి ‘అన్ని ఫార్మాట్లలో సూపర్ స్టార్స్’ అని క్యాప్షన్ పెట్టింది.
All-format superstars 🤩
The only five players to have won ICC @cricketworldcup, @T20WorldCup, and World Test Championship titles 🏆✨#WTC23 pic.twitter.com/baeTQNw4KJ
— ICC (@ICC) June 12, 2023
అన్ని ఫార్మాట్ల క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ట్రోఫీలు గెలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో 9 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. అవేంటంటే..?
వన్డే వరల్డ్ కప్ – ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా ఆరు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 1987, 1999, 2003, 2007, 2015లో ఆసీస్ వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచింది
టీ 20 వరల్డ్ కప్ – 2021లో ఆసీస్ పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టెస్టు గదతో ఆసీస్ ఆటగాళ్ల సంబురం
టెస్టు చాంపియన్‌షిప్ – 2023లో ఓవల్ మైదానం(ఇంగ్లండ్)లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టెస్టు గదను దక్కించుకుంది.
చాంపియన్స్ ట్రోఫీ – రెండు సార్లు ఆసీస్ ఈ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 2006, 2009లో ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది.
ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో ఆసీస్ 209 పరుగలు తేడాతో గెలిచింది. దాంతో తొలిసారే టెస్టు గదను తన్నుకుపోయింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే(46), విరాట్ కోహ్లీ(49) ప్రతిఘటించినా స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు పడడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.