U -20 WC | అండర్ – 20 వరల్డ్ కప్ చాంపియన్ ఉరుగ్వే.. 12 ఏళ్లకు మళ్లీ దక్షిణ అమెరికాకు ట్రోఫీ
U -20 WC : దక్షిణ అమెరికాకు చెందిన ఉరుగ్వే(Uruguay) పురుషల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ -20 వలర్డ్ కప్(Under -20 World Cup) చాంపియన్గా అవతరించింది. దాంతో, 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు సాధించింది. అంతేకాదు వరుసగా నాలుగేళ్లుగా ట్రోఫీని తన్నుకుపోతున్న...
U -20 WC : దక్షిణ అమెరికాకు చెందిన ఉరుగ్వే(Uruguay) పురుషల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ -20 వలర్డ్ కప్(Under -20 World Cup) చాంపియన్గా అవతరించింది. దాంతో, 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు సాధించింది. అంతేకాదు వరుసగా నాలుగేళ్లుగా ట్రోఫీని తన్నుకుపోతున్న యూరోపియన్ దేశాలకు చెక్ పెట్టింది. డిగో మారడోన స్టేడియం(Diego Maradona Stadium)లో జరిగిన ఫైనల్లో ఉరుగ్వే 1-0తో ఇటలీపై గెలుపొందింది.
ఆ జట్టు స్టార్ ప్లేయర్ లుసియానో రోడ్రిగెజ్(Luciano Rodríguez) 86వ నిమిషంలో గోల్ కొట్టాడు. దాంతో, ఉరుగ్వే జట్టు ఆటగాళ్లంతా సంబురాలు చేసుకున్నారు. ‘ఇది చాలా క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. మేము ఈ విజయానికి అర్హులం. మా కలను నిజం చేసుకున్నాం’ అని రోడ్రిగ్ మ్యాచ్ అనంతరం ఉద్వేగభరితంగా చెప్పాడు. ఉరుగ్వే 1997, 2013లో ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దక్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్ చివరిసారి 2011లో అండర్ -20 వరల్డ్ కప్ అందుకుంది.
ఫేవరెట్లకు షాక్
అండర్ -20 వరల్డ్ కప్ మే 20న మొదలైంది. ఏమాత్రం అంచనాలు లేని ఉరుగ్వే, ఇటలీ సంచలన ఆటతో ఫైనల్కు దూసుకెళ్లాయి. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన బ్రెజిల్, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు టైటిల్ వేటకు అర్హత సాధించలేకపోయాయి. దక్షిణకొరియాను 3-1తో ఓడించిన ఇజ్రాయెల్ మూడో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి
Roger Binny | ఫైనల్ మొదటి రోజునే భారత జట్టు ఓడిపోయింది : బీసీసీఐ బాస్
WTC Final: ఇండో-ఆసీస్ జట్లకు మ్యాచ్ ఫీజులో కోత.. శుభమన్ గిల్కు అదనపు పెనాల్టీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

