జగిత్యాల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) జనవరి 3న ఇష్టదైవమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ( Kondagattu ) ఆంజనేయస్వామి ఆలయాన్ని మరోమారు దర్శించుకోనున్నారు. స్థానిక ఆలయ అధికారులు, పూజారుల కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం , దీక్ష మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించారు.
ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కొండగట్టులో 100 గదులతో కూడిన అతిథి గృహం , 2,000 మంది కూర్చునే సామర్థ్యంతో దీక్ష మండపం నిర్మించడానికి ఆమోదం తెలిపింది . ఈ మేరకు టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు శనివారం కొండగట్టును సందర్శించి నిర్మాణాల కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ జూన్ 29న కొండగట్టు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు , పూజారులు ఆలయంలో తగినంత అతిథి గృహ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న భక్తుల ఇబ్బందులను పవన్‌కల్యాణ్‌కు వివరించారు.
టీటీడీ ద్వారా 100 గదుల అతిథి గృహం , 2,000 మంది సామర్థ్యం గల హాలు నిర్మించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని డిప్యూటీ సీఎంకు వివరించిన మేరకు అతిథి గృహం, దీక్షా మండపం నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు.