KTR | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జగన్కు కేటీఆర్ ఫోన్ చేశారు. జగన్ పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు కేటీఆర్కు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.