Worlds Richest T20 League : ప్రస్తుతం టీ20 లీగ్స్ హవా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు ఈ టోర్నమెంట్లలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో, ఈ మధ్యే ఫార్ములా 1 పోటీలకు పచ్చ జెండా ఊపిన సౌదీ అరేబియా(Soudi Arabia) ప్రభుత్వం తమ దేశంలో కూడా ఇలాంటి లీగ్ ఒకటి నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగా వరల్డ్స్ రిచెస్ట్ టీ 20 లీగ్ దిశగా పావులు కదుపుతోంది. అంతేకాదు ఈ విషయమై సౌదీ అధికారులు బీసీసీఐ(BCCI), ఐపీఎల్(IPL) ఫ్రాంఛైజీ పెద్దలతో మంతనాలు జరిపడమే కాకుండా తమ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో మరో లీగ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది.
సౌదీ ప్రభుత్వం ఈమధ్యే ఆటలపై ఆంక్షలను సడలించింది. దాంతో, ఫార్ములా 1 తో పాటు లివ్ గోల్ఫ్ ఆట కూడా ఆ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సొంతంగా టీ20 లీగ్ నిర్వహణతో స్పోర్ట్స్‌కు పెద్ద పీట వేయాలనేది సౌదీ అధికారుల ఆలోచన. అయితే.. బీసీసీఐ(BCCI) ప్రస్తుత నియమాల ప్రకారం భారత ఆటగాళ్లు ఇతర దేశాల లీగ్స్‌లో ఆడేందుకు అనుమతి లేదు. ఒకవేళ సౌదీ అభ్యర్థనకు బీసీసీఐ అంగీకరిస్తే.. ఇండియన్ ప్లేయర్స్ కొత్త లీగ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఐఎల్టీ20 పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
Soudi F
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ చాలా పాపులర్. 15 సీజన్లకు పూర్తి చేసుకున్న ఈ లీగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 16వ సీజన్ ఏప్రిల్ 4న ప్రారంభమైంది. గత ఐదు రోజులుగా హోరాహోరీ పోరాటాలు ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. దేశవాళీలో సత్తా చాటిన యంగ్‌స్టర్స్ సాయి సుదర్శన్(గుజరాత్ టైటన్స్), రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్), ప్రభుసిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) సత్తా చాటుతున్నారు.