చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిసాడు. బుధవారం నాటి మ్యాచ్లో ధోనీ గతంలోలాగా చురుకుగా కదలలేకపోవడానికి అతడి గాయమే కారణమని మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ వివరించాడు.
జట్టును గాయాల బెడద బాధిస్తున్నదని, సౌతాఫ్రికా బౌలర్ సిసండ మగల కూడా గాయంతో బాధపడుతున్నాడని, అతడు రెండు వారాలపాటు అందుబాటులో ఉండడని ఫ్లెమింగ్ తెలిపాడు. ధోనీ తన గాయం నుంచి త్వరగా కోలుకుని జట్టును నడిపిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.