న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత అథ్లెట్లు పతక జోరు కనబరుస్తున్నారు. శనివారం జరిగిన వేర్వేరు పోటీల్లో సోమన్ రానా, ఏక్తా భ్యాన్ రజత పతకాలతో మెరువగా, ప్రవీణ్‌కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 ఈవెంట్లో సోమన్ రానా 14.69మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
2006 మైన్బ్లాస్ట్లో కుడి కాలు కోల్పోయిన సోమన్ తన కెరీర్లో తొలిసారి అంతర్జాతీయ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మహిళల క్లబ్‌త్రో ఎఫ్51 ఈవెంట్లో ఏక్తా భ్యాన్ 19.80మీటర్ల దూరంతో వెండి పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్ 2.0మీటర్ల దూరంతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ 18 పతకాలు దక్కించుకుంది.