NZ vs BAN | సోధీకి 6 వికెట్లు.. రెండో వన్డేలో భారీ తేడాతో గెలిచిన న్యూజిలాండ్
NZ vs BAN : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్(Newzealand) స్పిన్నర్ ఇష్ సోధీ(Ish Sodhi) 6 వికెట్లతో చెలరేగాడు. దాంతో, కివీస్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా గడ్డపై 15 ఏళ్ల తర్వాత తొలి వన్డే విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్లాక్ కాప్స్ స్పిన్నర్ సోధీ ఆల్‌రౌండ్ ప్రదర్శన....
NZ vs BAN : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్(Newzealand) స్పిన్నర్ ఇష్ సోధీ(Ish Sodhi) 6 వికెట్లతో చెలరేగాడు. దాంతో, కివీస్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా గడ్డపై 15 ఏళ్ల తర్వాత తొలి వన్డే విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్లాక్ కాప్స్ స్పిన్నర్ సోధీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటుతో 35 రన్స్ చేసిన సోధీ బంతితో బంగ్లా పని పట్టాడు. కెప్టెన్ ఫెర్గూసన్ 42వ ఓవర్లో ఖలీద్ అహ్మద్‌ను బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, కివీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 254 పరుగులకే ఆలౌటయ్యింది. పర్యాటక జట్టులో టామ్ బండిల్(68), హెన్రీ నికోలస్(49) మాత్రమే రాణించారు. ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ మరో నాలుగు బంతులు ఉండగానే కివీస్ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్(Khaled Ahmed), మహెదీ హసన్(Mahedi Hasan) మూడేసి వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(44), మహ్మదుల్లా(49) మాత్రమే రాణించారు. సోధీ దెబ్బకు మిడిలార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు.
మన్కడింగ్ తప్పించుకొని
ఈ మ్యాచ్‌లో ఇష్ సోధీ() మన్కడింగ్ తప్పించుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్() నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సోధీని మన్కడింగ్ చేశాడు. రివ్యూ చూశాక థర్డ్ అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించాడు. దాంతో, కొంత అసహనానికి గురైన సోధీ వెటకారంగా హసన్‌ను అభినందించి పెవిలియన్ బాట పట్టాడు.
Ish Sodhi was run out at the non strikers end by Hasan Mahmud.
The third umpire checked and gave OUT! But when Sodhi started walking out, skipper Litton Das and Hasan Mahmud called him back again.
Sodhi gave Hasan a hug at the end.
Scenes ❤️
— M (@anngrypakiistan) September 23, 2023
అయితే.. కెప్టెన్ లిట్టన్ దాస్(Litton Das), హసన్ కలిసి మన్కడింగ్ వెనక్కి తీసుకుంటున్నామని, సోధీని నాటౌట్‌గా పరిగణించాలని అంపైర్‌తో చెప్పారు. దాంతో, అంపైర్ వెంటనే సోధీని వెనక్కి పిలిచాడు. ఊహించని పరిణామంతో మొదట్లో షాక్ తిన్న సోధీ క్రీజులోకి వచ్చాక హసన్‌ను ప్రేమగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష్ల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
Asian Games 2023 | కన్నుల పండువగా ఆసియా గేమ్స్ ఆరంభ వేడుక.. భారత పతాక ధారులు వీళ్లే
MS Dhoni | లక్కంటే మనోడిదే.. విమానంలో ధోనీ పక్క సీటు పట్టేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

