T20 World Cup 2024 : క్రికెట్లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుఉన్న పసికూన ఒమన్(Oman) జట్టు టీ20 వరల్డ్ కప్ సమరానికి సిద్దమవుతోంది. పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చేందుకు బలైమన స్క్వాడ్‌తో బరిలోకి దిగుతోంది. అవును.. బుధవారం ఒమన్ క్రికెట్ పొట్టి ప్రపంచ కప్ 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అఖిబ్ లియాస్(Aqib Ilyas) సారథిగా ఎంపికవ్వగా.. ఒమన్ టాప్ స్కోరర్ మక్సూద్, సీనియర్లు అయాన్ ఖాన్, మహమ్మద్ నదీమ్‌లు తుది బృందంలో చోటు దక్కించుకున్నారు. మరో నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్టర్లు ఎంపిక చేశారు.
🚨 Announcement 🚨
Here’s our Squad for the ICC T20 World Cup 2024! 🔥🏏
Oman 🇴🇲 will be meeting Australia 🇦🇺, England 🇬🇧, Namibia 🇳🇦 and Scotland in the Group B of the extravaganza starting 2nd June!
More to Follow..#OmanCricket #T20WC24 #SquadAnnouncement #Explore pic.twitter.com/lNdw4QQQbQ
— Oman Cricket (@TheOmanCricket) May 1, 2024
ఒమన్ స్క్వాడ్ : అఖీబ్ లియాస్(కెప్టెన్), జీషన్ మక్సూద్, కష్యప్ ప్రజాపతి, ప్రతిక్ అథవాలే(వికెట్ కీపర్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషి(వికెట్ కీపర్), మెహ్రన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫిఉల్లాహ్, కలీముల్లాహ్, ఫయ్యాజ్ బట్, షకీల్ అహ్మద్.
రిజర్వ్ ప్లేయర్లు : జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాత్సవ, సుఫియన్ మెహ్మూద్, జే ఒడెద్రా.
వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1న మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీలో ఒమన్ తన ముద్ర వేయాలనే పట్టుదలతో ఉంది. 20 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ఆ జట్టు గ్రూప్ బిలో ఉంది. తొలిపోరులో ఒమన్.. జూన్ 2న నమీబియాతో తలపడనుంది.