CSK vs PBKS : పదిహేడో సీజన్లో రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో పోరుకు సిద్ధమైంది. పాయింట్ట పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో పంజాబ్ తలపడుతోంది. చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సామ్ కరన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ గేమ్‌లో పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. తుది జట్టులో సీఎస్కే రెండు మార్పులు చేసింది.
చెన్నై తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దూబే రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్(కెప్టెన్), రీలే రస్సో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
చెపాక్‌లో పంజాబ్‌కు మెరుగైన రికార్డు ఉంది. చెన్నై గడ్డపై ఆడిన మూడు మ్యాచుల్లో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. జానీ బెయిర్‌స్టో సెంచరీతో కదం తొక్కగా.. ఫినిషర్ శశాంక్ సింగ్ అర్ధ శతకంతో చెలరేగాడు. దాంతో, 262 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ ఊదేసింది.